అర్హులందరికీ పోషకాహారం అందాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ పోషకాహారం అందాలి

Nov 1 2026 12:22 PM | Updated on Nov 1 2026 12:22 PM

ధర్మవరం అర్బన్‌: అర్హులందరికీ పోషకాహారం అందాలని జిల్లా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని ఎరగుంట సర్కిల్‌లోనున్న సీడీపీఓ కార్యాలయాన్ని శనివారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, బయోమెట్రిక్‌ హాజరును తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బంది విధులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న సరుకులు నాణ్యతతో నిర్దేశిత పరిమాణంలో క్రమం తప్పకుండా పంపిణీ చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఎప్పటికప్పుడు బరువు, ఎత్తు కొలతలు తీసి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్ల సౌకర్యాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. సీడీపీఓ, సూపర్‌వైజర్లు తరచూ అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, సిబ్బంది ఉన్నారు.

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement