సర్వీసు ఓటర్లకు అవగాహన కల్పించండి | - | Sakshi
Sakshi News home page

సర్వీసు ఓటర్లకు అవగాహన కల్పించండి

Oct 31 2026 8:07 AM | Updated on Oct 31 2026 8:07 AM

● అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

పుట్టపర్తి అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే సర్వీసు ఓటర్లకు హెల్ప్‌డెస్క్‌ ద్వారా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్లు, డిక్లరేషన్‌ ఫారాల్లో నమోదు చేయాల్సిన వివరాలను ఎలాంటి తప్పుల్లేకుండా పూరించేలా ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్‌ఓ రమేష్‌ బాబు, ఎంపీడీఓ నరేష్‌ కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్ల

గడువు పొడిగింపు

పుట్టపర్తి టౌన్‌: పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్ల గడువు పొడిగించినట్లు అదనపు జిల్లా ఎన్నికల అధికారి విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పరిషత్‌ ఎన్నికల విధులు ఉన్న ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేందుకు గతంలో అక్టోబర్‌ 30, నవంబర్‌ 1వ తేదీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో అవకాశం కల్పించామన్నారు. అయితే ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ గడువును పొడిగించిన దృష్ట్యా పోస్టల్‌ బ్యాలెట్‌ గడువును కూడా నవంబర్‌ 3వ తేదీ వరకూ పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. సర్వీసు ఓటర్లు సంబంధిత ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించాలని కోరారు.

మద్యం దుకాణాలు బంద్‌

పుట్టపర్తి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని వివిధ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను బంద్‌ చేస్తున్నట్లు ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ జిల్లా అధికారి నరసింహులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్‌ 1వ తేదీ (ఆదివారం) పోలింగ్‌ ఉంటుందని, అందువల్ల శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ మద్యం దుకాణాలు బంద్‌ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు జరిగే నవంబర్‌ 3వ తేదీ (మంగళవారం) కూడా మద్యం షాపులు బంద్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement