ఓటర్లకు ‘పచ్చ’ ప్రలోభాలు | - | Sakshi
Sakshi News home page

ఓటర్లకు ‘పచ్చ’ ప్రలోభాలు

Oct 31 2026 8:07 AM | Updated on Oct 31 2026 8:07 AM

● ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న

టీడీపీ నేతలు

● పలు ప్రాంతాల్లో పింఛన్‌

మొత్తం ఇస్తూ ఓటు అభ్యర్థన

● చర్యలు తీసుకోవాలని

మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట ఫిర్యాదు

పుట్టపర్తి అర్బన్‌: ఓటు అడిగితే ‘ఏం చేశారని ఓటు అడుగుతున్నారు’ అని జనం ముఖం మీదే ప్రశ్నిస్తున్నారు. బాబ్బాబు అంటూ బతిమాలినా ప్రచారానికి ఎవరూ రావడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ఓటమి ఖాయమని తెలుసుకున్న కూటమి పార్టీల నేతలు ఓటర్లకు తాయిళాలు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు పచ్చనేతలు డబ్బులు పంచుతూ సోషల్‌ మీడియాకు చిక్కారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. అలాగే సచివాలయ సిబ్బందిని బెదిరించి వారు పంచాల్సిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల మొత్తాన్ని టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులే పంచుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అమడగూరు మండలం జేకేపల్లిలో ఎంపీటీసీ అభ్యర్థి వెంకటరమణ శుక్రవారం ఓటర్లకు టీడీపీ కరపత్రంతో పాటు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ మొత్తాన్ని అందజేశారు. కూటమికి ఓటు వేయకపోతే వచ్చేనెల నుంచి పింఛన్‌ రద్దవుతుందని ఓ వృద్ధుని బెదిరిస్తున్న వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఇలా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి నామినేషన్‌ రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి డీఆర్‌డీఏ పీడీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను వారికి పంపారు. అలాగే టీడీపీ అభ్యర్థులకు పింఛన్‌ డబ్బులు ఇచ్చి పంపిణీ చేయించిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement