ధర్మవరంలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ | - | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌

Oct 31 2026 8:07 AM | Updated on Oct 31 2026 8:07 AM

ధర్మవరం అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పట్టణంలో పోలీసుల ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన రహదారుల్లో 300 మంది పోలీసులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో 134 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 10 నుంచి 11 కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామన్నారు. పోలింగ్‌ జరిగేసమయంలో ఎవరైనా అల్లర్లు, గొడవలు సృష్టించినా, ఓటర్లను బెదిరించినా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు జగన్నాథ్‌రాజు, శ్రీనివాసులు, సీఐలు రెడ్డెప్ప, జయనాయక్‌, ప్రభాకర్‌, మహమ్మద్‌ అలి, లింగన్న, బొజ్జప్ప, సునిత, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement