మడకశిర: ఎన్నికల ముందు ప్రస్తుత మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎన్నో హామీలు గుప్పించారు. గెలిచి రెండేళ్లు దాటిపోతున్నా ఆ హామీలును మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మడకశిర నగర పంచాయతీ సుందరీకరణ (బ్యూటిఫికేషన్) కూటమి ప్రభుత్వంలో ఆరంభ శూరత్యంగానే మిగిలింది. ఎమ్మెల్యే అయిన వెంటనే బ్యూటిఫికేషన్ పనులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హడావుడి చేసి ప్రారంభించారు. నాటి నుంచి నేటి దాకా ఆ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
కలగానే రింగు రోడ్డు..
మడకశిరలో రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024లో ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు మడకశిర మండలంలోని గుండుమల గ్రామాన్ని సందర్శించారు. అప్పుడు మడకశిరంగా ఎన్నో హామీలు ఇచ్చారు.ఇందులో ప్రధానమైనది రింగ్ రోడ్డు నిర్మాణం. రూ.60 కోట్లతో రింగ్‌రోడ్డు ఏర్పాటు చేస్తామని నిండు సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా రింగ్ రోడ్డు సాధించడంలో విఫలమయ్యారని పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మడకశిర చెరువుకు కృష్ణా జలాలేవీ?
మడకశిర చెరువులో నీరు ఉంటే పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ఉండదు. ఈచెరువులో నీరులేకపోతే పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ ఏడాది వర్షాలు రాక మడకశిర చెరువులోకి నీరు చేరలేదు. ఈక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చొరవ తీసుకుని మడకశిర చెరువును కృష్ణా జలాలతో నింపుతారని పట్టణ ప్రజలు ఆశించారు. అయితే ఆయన పట్టించుకోకపోవడంతో మడకశిర పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ముంచుకొచ్చే ప్రమాదం ఏర్పడింది. చెరువు సమీపంలోని ఊటబావిలో నీరు కూడా క్రమంగా తగ్గుతుండడమే దీనికి నిదర్శనం. ఇదిలా ఉండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మడకశిర చెరువును రెండుసార్లు కృష్ణా జలాలతో నింపడంతో అప్పడు తాగునీటి సమస్యే ఉత్పన్నం కాలేదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
మడకశిర సుందరీకరణ పనులు
ప్రారంభించి వదిలేసిన
ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
నేటికీ కార్యరూపం దాల్చని
రింగ్ రోడ్డు నిర్మాణం
ట్రాఫిక్‌తో నిత్యం ప్రజల అవస్థలు
మడకశిర చెరువును కృష్ణా జలాలు
నింపడంలోనూ విఫలం
తాగునీటి సమస్య ముంచుకొస్తున్నా పట్టని వైనం


