ఉమ్మడి అనంత మీదుగా స్లీపర్‌ కోచ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి అనంత మీదుగా స్లీపర్‌ కోచ్‌

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

● 1 నుంచి పట్టాలెక్కనున్న వందేభారత్‌ రైళ్లు

హత్య కేసు నిందితుడు అరెస్ట్‌

ముదిగుబ్బ: ముదిగుబ్బలో జరిగిన బేల్దారి రామాంజనేయులు హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం సీఐ రామసుబ్బయ్య తెలిపిన మేరకు.. నరేష్‌, రామాంజనేయులు బావా బావమరిది. వీరిద్దరూ ఒకే ఇంటి నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. అయితే నరేష్‌ను రామాంజనేయులు తరచూ తిడుతుండేవాడు. విసిగిపోయిన నరేష్‌ అక్కడే ఉన్న ఇనుప రాడ్‌తో రామాంజనేయులు తలపై బలంగా బాది, అక్కడి నుంచి ఉడాయించాడు. రామాంజనేయులును 108 ద్వారా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. దొరిగిల్లు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బైకుపై వచ్చిన నిందితుడు పోలీసులను చూసి పారిపోతుండగా, వెంబడించి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, పల్సర్‌ బైకును స్వాధీనం చేసుకున్నారు. కాగా 24 గంటల్లోపే నిందితుడిని అరెస్టు చేయడంతో సీఐను ఉన్నతాధికారులు అభినందించారు.

ప్రయాణికురాలి మెడలోని గొలుసు మాయం

గుత్తి: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న లక్ష్మిదేవి అనే ప్రయాణికురాలి మెడలోని బంగారు గొలుసు దొంగలు అపహరించారు. గుంతకల్లు మండలం ఇమాంపురానికి చెందిన లక్ష్మిదేవి గుత్తి బస్టాండ్‌లో అనంతపురం వెళ్లేందుకు బస్సు ఎక్కింది. శివారు ప్రాంతంలోని మాతృశ్రీ ఆస్పత్రి వద్దకు వెళ్లగానే లక్ష్మిదేవి మెడలోని నాలుగు తులాల గొలుసు కనిపించలేదు.వెంటనే అప్రమత్తమైన ఆమె.. బస్సు ఆపాలని చెప్పింది. అయితే డ్రైవర్‌ బస్సును ఆపకుండా పామిడి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. కాగా, చోరీ జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని, గుత్తిలో ఫిర్యాదు చేసుకోవాలని పోలీసులు చెప్పారు. దీంతో బాధితురాలు గుత్తికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు ఇస్తుండగా తీసుకోలేదు. గుత్తి, పామిడి పోలీస్‌ స్టేషన్లలో రెండుచోట్లా ఫిర్యాదు తీసుకోకపోవడంతో బాధితురాలు లబోదిబోమంటోంది.

ప్రజల పరిస్థితి వర్ణనాతీతం

కూటమి ప్రభుత్వం ఏర్పడిన్పటి నుంచి మున్సిపాలిటీలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. తాగునీరు వారం రోజులైనా సరిగ్గా రావడం లేదు. చెత్త సేకరణ ట్రాక్టర్‌లు నెలకు రెండు సార్లు కూడా రావడం లేదు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.

– గుండా ఈశ్వరయ్య, చేనేత కార్మికుడు, ధర్మవరం

గుంతకల్లు: దేశంలోనే మొట్టమొదటి వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ (నిద్రించే సౌకర్యం ఉన్న రైలు బోగీ) రైళ్లు గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్ల మీదుగా (డైలీ) రాకపోకలు సాగించనున్నట్లు డివిజన్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ రైళ్లను వర్చువల్‌ పద్ధతిన ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపాయి. బెంగళూరు– ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినల్‌ (ముంబై)– బెంగళూరు మధ్య నవంబర్‌ 1 నుంచి పట్టాలెక్కించడానికి రైల్వే బోర్డు అనుమతులు జారీ చేసినట్లు తెలిపాయి. ఈ రైళ్లలో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. అందులో 3 ఏసీ 11, టూటైర్‌ ఏసీ 4, ఫస్ట్‌ క్లాస్‌ 01 ఉంటాయి. ముంబై– బెంగళూరు మధ్య దాదాపు 1118 కి.మీ ప్రయాణానికి 22 గంటలకు పైగా సమయంలో పట్టేది. దాదాపు 6 గంటలపైగా సమయం ఆదా చేస్తున్నట్లు డివిజన్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైళ్లు

రాకపోకల వివరాలు ..

బెంగళూరు రైల్వే జంక్షన్‌లో (27652) నవంబర్‌ 1న సాయంత్రం 7.45 గంటలకు బయల్దేరి ధర్మవరం జంక్షన్‌కు రాత్రి 10.10 గంటలకు, అనంతపురం రైల్వేస్టేషన్‌కు 10.28, గుంతకల్లు జంక్షన్‌కు 11.20, రాయచూర్‌కు అర్ధరాత్రి 01.03 గంటలకు, యాదగిరికి 1.43 గంటలకు, వాడి జంక్షన్‌కు 2.50 గంటలకు, కలబురిగి జంక్షన్‌కు 3.08 గంటలకు, షోలాపూర్‌కు తెల్లవారుజూమున 4.20 గంటలకు, పూణే జంక్షన్‌కు ఉదయం 8 గంటలకు, కళ్యాణి జంక్షన్‌కు ఉదయం 10.42 గంటలకు ఇక చివరగా ఛత్రపతి మహారాజ్‌ శివాజీ టెర్మినల్‌ స్టేషన్‌కు మరుసటి రోజు (నవంబర్‌ 2) ఉదయం 11.55 గంటలకు చేరుతుందన్నారు. ఇక ఛత్రపతి మహారాజ్‌ శివాజీ టెర్మినల్‌ సేష్టన్‌ (27651) నుంచి మరో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైలు నవంబర్‌ 1న రాత్రి 8.10 గంటలకు బయల్దేరనుంది. కళ్యాణి జంక్షన్‌కు 20.48 గంటలకు, పూణే జంక్షన్‌కు 11.40 గంటలకు, కలబురిగి జంక్షన్‌కు తెల్లవారుజూమున 4.13 గంటలకు, వాడి జంక్షన్‌కు ఉదయం 5.05 గంటలకు, యాదగిరి రైల్వేస్టేషన్‌కు 5.08 గంటలకు, రాయచూర్‌కు 6.03 గంటలకు, గుంతకల్లు జంక్షన్‌కు 7.30, అనంతపురానికి 8.38 గంటలకు, ధర్మవరం జంక్షన్‌కు 9.40 గంటలకు,బెంగళూరు జంక్షన్‌కు మధ్యాహ్నం 12.00 గంటలకు చేరుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement