‘అధర్మ’ పాలన.. ప్రజల వేదన | - | Sakshi
Sakshi News home page

‘అధర్మ’ పాలన.. ప్రజల వేదన

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

ధర్మవరం: ధర్మవరానికి సిల్క్‌సిటీగా పేరుంది.. గత ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రశాంతతకు పేరుగాంచింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండున్నరేళ్లలో అభివృద్ధి లేదు..పట్టణ పరిశుభ్రత ప్రశ్నార్థకంగా మారింది.ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సత్యకుమార్‌ అమరావతికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో స్థానికంగా టీడీపీ, బీజేపీ, జనసేన నేతల అక్రమ వసూళ్లు, అరాచకాలు, బెదిరింపులు, వేధింపులు తారస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కూటమి నేతలు సాగించిన దౌర్జన్యకాండ రాష్ట్రవ్యాప్తంగా సంచనలంగా మారింది. ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో 41,500 గృహాలు, 1.45 లక్షల జనాభా ఉంది. 1,06,250 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 52,310 మంది, మహిళలు 53,925 మంది ఉన్నారు. పట్టణంలో మొత్తం 41వేల దాకా గృహ, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా పారిశుధ్య కార్మికులు అందుబాటులో లేరు. దీంతో పట్టణ పరిశుభ్రత ప్రశ్నార్థకంగా మారింది. పట్టణ జనాభాకు తగ్గట్టుగా 500 మందికి పైగా పారిశుధ్య కార్మికులు ఉండాలి. అయితే ప్రస్తుతం 253 మంది దాకా కార్మికులు ఉన్నారు. వీరిలో శాశ్వత పారిశుధ్య కార్మికులు 123 మంది, ఆప్కాస్‌ కింద 43 మంది, తాత్కాలిక కార్మికులు 87 మంది పని చేస్తున్నారు. వీరిలో 25 మంది దాకా ఇతర విభాగాల్లో పని చేస్తున్నారు. దీంతో 48 వార్డుల్లో పని చేయడం తలకు మించిన భారంగా మారింది. దీంతో పట్టణంలో ఎటుచూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వార్డుకు ఇద్దరు, ముగ్గురు పారిశుధ్య కార్మికులు ఉండేవారు. సచివాలయ ఉద్యోగులను పర్యవేక్షణ ఉండేది. తద్వారా డ్రైన్లలో పూడిక తీత, చెత్త సేకరణ సక్రమంగా జరిగేది. మొత్తం 13 చెత్తసేకరణ ట్రాక్టర్‌లు, 3 కాంపాక్టర్‌లు మాత్రమే పని చేస్తున్నాయి.

అధికారుల అలసత్వం.. అభివృద్ధికి శాపం..

మున్సిపాలిటీలో అఽధికారుల అలసత్వం, అవినీతి అభివృద్ధికి శాపంగా మారింది. ఇంజినీరింగ్‌ విభాగంలో నూతనంగా వేసిన రోడ్లలో నాణ్యత లోపించింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, వారిచ్చే తాయిళాలకు లొంగి బిల్లులు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. టౌన్‌ ప్లానింగ్‌లో ఎవరైనా ఇళ్లు నిర్మించుకునేందుకు పర్మిషన్‌ తీసుకోవాలంటే డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాక 10 సెంట్లకు పైగా నిర్మించే నిర్మాణాలకు మాత్రమే సెల్లార్‌ అనుమతి ఇవ్వాలన్న నిబంధన ఉన్నా.. ఇష్టారాజ్యంగా అనుమతి ఇస్తున్నారు. దీంతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ల జారీ విషయంలోనూ అధికారుల అలసత్వం కనిపిస్తోంది.

పెచ్చుమీరుతున్న అరాచకాలు,

అక్రమ వసూళ్లు

బెంబెలెత్తుతున్న ధర్మవరం ప్రజలు

నియోజకవర్గ అభివృద్ధిని

గాలికొదిలేసిన మంత్రి సత్యకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement