‘గవిమఠం’ వివాదంపై విచారణ | - | Sakshi
Sakshi News home page

‘గవిమఠం’ వివాదంపై విచారణ

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

ఉరవకొండ: ప్రసిద్ధిగాంచిన ఉరవకొండ గవి మఠ సంస్థానం పీఠాధిపతి పీఠంపై నెలకొన్న వివా దం గురువారం దేవదా య, ధర్మదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. గవిమఠం ఎనిమిదో పీఠాధిపతిగా కొనసాగిన చెన్నబసవ రాజేంద్రమహస్వామి ఈ ఏడాది జూలై 18న శివైక్యం పొందారు. పీఠాధిపతుల వారసత్వ హక్కుల విషయంలో ప్రస్తుత గవిమఠ ఉత్తరాధికారి డాక్టర్‌ కరిబసవరాజేంద్రస్వామి, ఆదోని చోకి మఠం పీఠాధిపతులు కల్యాణస్వామిజీ మధ్య వివాదం తలెత్తింది. దీంతో కర్నూలు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రామాంజనేయులు ఇద్దరు స్వామీజీల వాదనలు విన్నారు. ఈవిచారణలో గవిమఠం అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధారాణి పాల్గొన్నారు.

యువతి ఆత్మహత్యాయత్నం

పావగడ: పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కి యువతి గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.వివరాలు.. పావగడ తాలూకా దొడ్డేనహళ్లికి చెందిన గణేశ్‌, కుందుర్పి మండలం కరిగానపల్లికి చెందిన సింధు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే భర్త గణేశ్‌ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. న్యాయం చేయాలని పోలీసులను వేడుకోగా.. వారు పట్టించుకోలేదని పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు, అగ్ని మాపకదళం ఆమెను కాపాడారు.

రైలు ఢీకొని

ఎలుగుబంట్ల మృత్యువాత

డి.హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌): డి.హీరేహాళ్‌ మండల పరిధిలోని కల్యం గ్రామ సమీపంలో రైలు ఢీకొని రెండు ఎలుగుబంట్లు మృత్యువాతపడ్డాయి. ఈవిషయాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమచారం అందించారు. రాయదుర్గం ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ దామోదర్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఏపీ హెచ్‌ఈఆర్‌ఎంసీ మెంబర్‌ సెక్రటరీగా కృష్ణయ్య

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫీజు రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఏపీ హెచ్‌ఈఆర్‌ఎంసీ) మెంబర్‌ సెక్రటరీ కమ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా ప్రొఫెసర్‌ ఎస్‌.కృష్ణయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జె.శ్యామలరావు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఉన్నత విద్యలో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.

గొర్తి శ్రీనివాసరావు మృతి అనుమానాస్పదం

● జ్వాలాపురం శ్రీకాంత్‌

అనంతపురం కల్చరల్‌: విజయవాడ బ్రాహ్మణ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ మేనేజర్‌ గొర్తి శ్రీనివాసరావు మృతి బాధాకరమని, ఆయన మరణంపై అనుమానాలున్నాయని మాజీ ప్రభుత్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్‌ అన్నారు. గురువారం ఆయన నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గొర్తి శ్రీనివాసరావు తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సొసైటీలోని బుచ్చి రాంప్రసాద్‌, ఎండీ చంద్రశేఖర్‌ ఆజాద్‌, సీఈవో నాగసాయి, బాలా త్రిపుర సుందరి పాత్రపై అనేక అనుమానాలున్నాయని, దీనిపై సమగ్ర విచారణకు వెంటనే ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన రెండున్నరేళ్లలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement