కోత పెట్టారు.. కొత్తవీ ఇవ్వరు! | - | Sakshi
Sakshi News home page

కోత పెట్టారు.. కొత్తవీ ఇవ్వరు!

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

పుట్టపర్తి అర్బన్‌: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రతినెలా పింఛన్లు అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండున్నరేళ్లలో ఉన్నవాటిని కోత పెట్టారు.. కొత్త పింఛన్లు ఒక్కటీ ఇవ్వలేదు. ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్న పేదలు.. ఈ నెలలో అందిస్తారని ఎదురుచూస్తే.. చివరకు నిరాశే మిగులుతోంది. జిల్లాలో సుమారు 2,74,578 పింఛన్లు ఉండగా ప్రస్తుతం 2,56,883 పింఛన్లకు నగదు పంపిణీ చేస్తున్నారు. దీంతో రెండున్నర ఏళ్లలో సుమారు 17,695 పింఛన్లను కోత వేశారు. అయితే ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థలు సమీపిస్తున్నా యని.. కొత్త పింఛన్లకోసం దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో సుమారు 56,195 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, మంచం పట్టిన రోగులు దరఖాస్తు చేసుకున్నారు.

రెండున్నర ఏళ్లలో 17,695 పింఛన్ల కోత..

ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్‌ ఇస్తామని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. హామీని విస్మరించారు. ప్రభు త్వం అధికారంలోకొచ్చి రెండున్నర ఏళ్లు అయ్యింది. జిల్లాలో సుమారు 17,695 పింఛన్లు కోత వేశారు. అప్పట్లో 2,74,578 మందికి పింఛన్లు వస్తుండగా ప్రస్తుతం ఈనెల 30న అధికారులు పంపిణీ చేయనున్న పింఛన్లు 2,56,883 ఉన్నాయి. దీంతో ఒక్క జిల్లాలోనే 17,695 పింఛన్లు తొలగించారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కలెక్టరేట్‌కు, ఆర్డీఓ కార్యాలయానికి ప్రతి వారం పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఏమి చేయలేక అధికారులు చేతులెత్తేశారు. ప్రభుత్వం అనుమతి కోసం దరఖాస్తులు పంపామని వస్తాయని చెప్తున్నారు.

ప్రచారం సరే..పింఛన్ల ఏవీ?

జిల్లాలో సుమారు 1.80 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వారంతా స్థానిక సంస్థల్లో ఓటు వేయక పోతే కూటమి పార్టీలకు డిపాజిట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఎక్కడా పింఛన్‌ పేరు కూడా ఎత్తకుండా ప్రచారం చేస్తు న్నారు. ఎక్కడైనా ప్రజలు నిలదీస్తే ఎన్నికల కోడ్‌ పూర్తికాగానే ఇస్తామని చెప్తున్నారు. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటికే దివ్యాంగ పింఛన్లపై సర్వే చేసి రీ వెరిఫికేషన్‌ చేసి జాబితాను సిద్ధం చేశారు. అందులో సుమారు 35 వేల మందికి రీ వెరిఫికేషన్‌ చేసి ఉంచారు. ఎంతమందికి పింఛన్లు వస్తాయో.. ఎన్ని కోత పడతాయోనని అర్హులు ఆందోళన చెందుతున్నారు.

నేటి నుంచి పింఛన్లు పంపిణీ..

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఉండడంతో నవంబర్‌ 1న పంపిణీ చేయాల్సిన పింఛన్లు ఈనెల 30న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. 30న అందుబాటులో లేని కార్డుదారులకు నవంబర్‌ 4,5 తేదీల్లో పంపిణీ ఉంటుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఓటింగ్‌ , కౌంటింగ్‌ ఉంటాయన్నారు.

కొత్త పింఛన్ల కోసం

56,195 మంది ఎదురుచూపు

రెండున్నరేళ్లలో 17,695 మందికి కోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement