వందశాతం ఉత్తీర్ణత సాధించాలి | - | Sakshi
Sakshi News home page

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

● ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

అగళి: పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులంతా కృషి చేయాలని డీఈఓ కిష్టప్ప సూచించారు. బుధవారం ఆయన స్థానిక ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. హాస్టల్‌, సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్స్‌ సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్షిక పరీక్షల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా వారిపై శ్రద్ధ చూపాలన్నారు. వెనుకబడిన ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయులు దత్తత తీసుకుని చదివించాలన్నారు. డీఈఓ వెంట ఎంఈఓలు నాగేంద్ర, చంద్రశేఖర్‌ నాయుడు, ప్రిన్సిపాల్‌ విజయకుమారి, ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement