‘పచ్చ’ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

అమడగూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగులు యథేచ్ఛగా ‘కోడ్‌’ ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బుధవారం అమడగూరులో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వీబీజీ రామ్‌జీ (ఉపాధి హామీ) ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రామాంజనేయులు ‘కోడ్‌’ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే ప్రచార కార్యక్రమానికి అన్నీతానై వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని కచ్చితమైన నిబంధన ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా టీడీపీ తరఫున ప్రచారం సైతం నిర్వహించారు. అయినా జిల్లా ఉన్నతాధికారులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కోడ్‌ ఉల్లంఘనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పలువురు స్థానికులు తెలిపారు.

టీడీపీకి ఓటేయండి..బిల్లులిప్పిస్తా

పుట్టపర్తి అర్బన్‌: ‘‘మీకు టీడీపీకి ఓటు వేయండి...ఉపాధి హామీ పనుల్లో మీరు పనులు చేయకపోయినా నేను బిల్లులు ఇప్పిస్తా’’ అంటూ పెడపల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గౌతం టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం పుట్టపర్తి మండలం పెడపల్లిలో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించగా...ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గౌతం వారివెంట నడుస్తూ ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో తిరుగుతూ ‘‘మీకు పనులు చేయకపోయినా బిల్లులు చేయిస్తా... జాబ్‌ కార్డు విషయంలో అండగా ఉంటా’’ అని ఓట్లు అభ్యర్థించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, రేషన్‌ డీలర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని అధికారులు చెప్తున్నా... అవేమీ పట్టించుకోకుండా పచ్చకండువా వేసుకుని దర్జాగా ప్రచారం చేస్తున్నారు.

పథకాలు నిలిచిపోతాయ్‌

హిందూపురం(చిలమత్తూరు): టీడీపీకి ఓటు వేయకపోతే పథకాలు నిలిచిపోతాయ్‌ జాగ్రత్త అంటూ మెప్మా అధికారులు మహిళా సంఘాల నాయకులను బెదిరించారు. టీడీపీ నేతల సూచనతో బుధవారం హిందూపురం రహమత్‌పురంలోని ఓ షాదీమహల్‌లో మెప్మా సంఘాలతో ఆర్‌పీలు సమావేశాలు ఏర్పాటు చేశారు. టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని, మహిళా సంఘాల సభ్యులతో ఓట్లు వేయించాలని హుకుం జారీ చేశారు. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని బెదిరించారు. ఇలా.. ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఏదో విధంగా టీడీపీకి ఓటు పడేలా కుటిలయత్నానికి పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారులు ద్వారా పొజిషన్‌ పత్రాలు అందిస్తూ టీడీపీకి ఓటు వేయాలని ప్రజలకు చెబుతూ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

జిల్లాలో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన

టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు

ఓట్ల కోసం మహిళా సంఘాలతో ‘మెప్మా’ అధికారుల సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement