వైఎస్సార్‌సీపీతోనే మైనార్టీల సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీతోనే మైనార్టీల సంక్షేమం

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

హిందూపురం(చిలమత్తూరు): వైఎస్సార్‌సీపీతోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఖాదర్‌ బాషా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘని, వైఎస్సార్‌సీపీ నేత ఇస్మాయిల్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి డి.షాజియాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్‌ తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో సీఎం అయ్యాక మైనార్టీలకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు కల్పించారని కొనియాడారు. టీడీపీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందని, వైఎస్‌ జగన్‌ ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడ్డారని స్పష్టం చేశారు. హిందూపురంలో మైనార్టీ మహిళకు చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అవకాశం కల్పించడమే కాక రాష్ట్రంలో 12 మందికి అవకాశం కల్పించి మైనార్టీలను గుర్తించారని తెలిపారు. పట్టణంలో దాదాపు 40 వేల మైనార్టీల ఓట్లు ఉన్నాయని, మైనార్టీలకు కనీసం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి ఇస్తామని ప్రకటన చేసే దమ్ము టీడీపీకి ఉందా అని ఖాదర్‌ బాషా ప్రశ్నించారు. మైనార్టీలు టీడీపీకి ఓటేస్తే వక్ఫ్‌ నల్లచట్టాలను తీసుకొచ్చిన బీజేపీకి ఓటేసినట్టే అని, మైనార్టీలు ఎవరూ టీడీపీకి ఓటేయొద్దని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షాజియా, కౌన్సిలర్‌ అభ్యర్థుల ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు చాంద్‌ బాషా, ఆసిఫుల్లా, ఫరూఖ్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే

వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌ బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement