ఆర్టీసీ డ్రైవర్‌పై యువకుల దాడి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్‌పై యువకుల దాడి

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

తనకల్లు: మండల పరిధిలోని కొక్కంటి క్రాస్‌లో బుధవారం ఆర్టీసీ డ్రైవర్‌ దుంగావత్‌ వేమన్న నాయక్‌పై నలుగురు యువకులు దాడి చేశారు. డ్రైవర్‌ను బస్సులో నుంచి కిందకు లాగి కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపించారు. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. దుంగావత్‌ వేమన్న నాయక్‌ కదిరి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా నాయక్‌ బుధవారం బెంగుళూరు నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కదిరికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లికి చెందిన విశ్వనాథ్‌, మధుకుమార్‌, సునీల్‌, రాములుతో పులికల్లు వద్ద బైక్‌లకు సైడ్‌ ఇవ్వలేదని గొడవ జరిగింది. అక్కడి నుంచి యువకులు ద్విచక్ర వాహనాల్లో ఆర్టీసీ బస్సును వెంబడించి, కొక్కంటిక్రాస్‌ వద్ద హైవేపై బైక్‌లను అడ్డంగా ఉంచి బస్సును ఆపేశారు. బస్సులో ఉన్న డ్రైవర్‌ను బలవంతంగా కిందకు దించి విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన స్థానికులను బెదిరించడంతో ఆగ్రహించిన వారు యువకులను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువకుల దాడిలో గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడిన యువకుల్లో విశ్వనాథ్‌ మొలకలచెరువు మండలం నయనాచెరువు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ తెలిపారు.

నలుగురిపై కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement