అగళి: మండల పరిధిలోని నరసంబూది గ్రామంలో బుధవారం కేంద్ర కమిటీ సభ్యులు ఆశిష్, కవిత పర్యటించారు. జాతీయ మహిళా ఫ్రెండ్లీ ప్రోగ్రామ్‌కు నరసంబూది గ్రామ పంచాయతీ రాష్ట్రం నుంచి ఎంపికవ్వడంతో అందుకు సంబంధించిన మౌలిక వసతులను వారు పరిశీలించారు. అనంతరం పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమలపై గ్రామ సభ నిర్వహించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోని వివిధ అభివృద్ధి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలోని మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం తదితర కార్యక్రమాలపై ఆరా తీశారు. అనంతరం స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి అందుతున్న ప్రభుత్వ సేవలు, గ్రామంలో కల్పిస్తున్న సౌకర్యాలు, ఉమెన్ ఫ్రెండ్లీ వాతావరణంపై నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి మల్లీశ్వరి, ఓఎస్డీ శ్రీనాథ్ రెడ్డి, డీపీఓ వెంకటరత్నం, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీఈఓ కృష్ణప్ప, డీఎల్‌పీఓ నరసింహరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సుబ్బరావు, మండల పరిషత్ పరిపాలనాధికారి రాజేంద్రప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓలు రెడ్డి ప్రకాష్, పద్మ, ఏఓ నాగరాజు, ఎస్‌ఐ రంగడుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్తులు, మహిళలకు అందుతున్న సేవలపై కేంద్ర కమిటీ సభ్యుల ఆరా


