బేల్దారుల మధ్య ఘర్షణ: ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

బేల్దారుల మధ్య ఘర్షణ: ఒకరి మృతి

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

ముదిగుబ్బ: మండల కేంద్రంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా బావ, బావమరిది మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన బావ మృతి చెందాడు. సీఐ రామసుబ్బయ్య తెలిపిన వివరాలు.. బుక్కపట్నం మండలం గశికవారిపల్లికి చెందిన రామాంజినేయులు(40) అతని బావమరిది నరేష్‌ భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ముదిగుబ్బలోని ఓ భవన నిర్మాణ పనులు చేస్తుండగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో రామాంజినేయులు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం 108లో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మతి స్థిమితం లేని వ్యక్తిని

చితకబాదిన కానిస్టేబుల్‌

నల్లచెరువు: మండల కేంద్రంలోని బురుజు గంగమ్మ ఆలయం వద్ద సోమవారం రాత్రి మతి స్థిమితం లేని వ్యక్తిపై నల్లచెరువు పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ బాబ్జాన్‌ అకారణంగా దాడి చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి కొన్ని రోజులుగా మతి స్థిమితం కోల్పోయి పగలు, రాత్రి తేడా లేకుంగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఈక్రమంలో బురుజు గంగమ్మ ఆలయం వద్ద కూర్చొని ఉన్న శ్రీనివాసరెడ్డిని దగ్గరకు పిలిచిన కానిస్టేబుల్‌ అతడిని దుర్భాషలాడి చితక బాదాడు. మంగళవారం శ్రీనివాసరెడ్డికి అయిన గాయాలను కుటుంబ సభ్యులు మీడియాఎదుట ప్రదర్శించారు.

జరుట్లరాంపురంలో

చిరుతల కలకలం

వజ్రకరూరు: జరుట్లరాంపురం గ్రామంలో చిరుతల సంచారం కలకలం రేపింది. వివరాలు.. మంగళవారం గ్రామానికి చెందిన హుసేన్‌సాబ్‌, గొల్ల రమేష్‌ తమ గొర్రెలను గ్రామ పరిసరాల్లో మేతకు తోలుకెళ్లారు. ఈక్రమంలో మూడు గొర్రెలు కనిపించకుండా పోవడంతో వాటిని వెతుక్కుంటూ వెళ్లారు. మూడు గొర్రెలను చంపి తింటున్న మూడు చిరుతలను చూసి వారు తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశా రు. ఈప్రాంతంలో చిరుతల సంచారం ఉన్నప్పటికీ అటవీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement