తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్‌

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

యల్లనూరు: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆదివారం రాత్రి తిమ్మంపల్లిలోని నివాసంలో పుట్లూరు సీఐ వంశీ కృష్ణ, ఎస్‌ఐలు రామాంజనేయరెడ్డి, ధరణిబాబు అరెస్ట్‌ చేసి అనంతపురం తరలించారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో తిమ్మంపల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మిద్దె మనీష నామినేషన్‌ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ నేతల ఒత్తిడితో తిమ్మంపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని మనీషను సాయంత్రం 5 గంటల వరకూ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు నిర్భంధించారు. ఈ క్రమంలో ఆదివారం పెద్దారెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఈ తరుణంలో అక్రమ కేసులు బనాయించి ఆయనను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనను అనంతపురంలోని ఇంటికి తరలించారు. కాగా అంతకుముందు ఉదయం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. తాడిపత్రిలో గొడవల కారణంగా తిమ్మంపల్లిలోనే ఉండాలని సూచించారు.

వైభవంగా గిరి రఽథోత్సవం

పుట్టపర్తిటౌన్‌: పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం పుట్టపర్తి పట్టణంలో సత్యసాయి గిరి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా ప్రశాంతి నిలయం ముఖద్వారం వద్ద అందంగా అలకరించిన రథంలో సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథాన్ని విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి, గణేష్‌ కూడలి,ె పెట్రోల్‌ బంక్‌, చింత తోపులు, శివాలయం వీధి, గోవిందయ్యపేట, పెద్దబజార్‌ మీదుగా ఊరేగించి, తిరిగి ప్రశాంతి నిలయానికి చేర్చారు. మహా మంగళ హారతులతో రథోత్సవం ముగించారు. కార్యక్రమంలో దేశ, విదేశీ భక్తులు పాల్గొన్నారు.

వ్యక్తి ఆత్మహత్య

● ఘటనకు ముందు ఇంటికి ఫోన్‌ చేసి

మరీ అఘాయిత్యం

గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లి పంచాయతీ గొల్లపల్లి దళితవాడకు చెందిన గజ్జి రామచంద్ర (43) తన వ్యవసాయబోరు వద్ద ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. సాయంత్రం ఆయన రాగిమాను కుంట సమీపంలో ఉన్న వ్యవసాయబావి వద్దకు వెవెళ్లి ఇంటికి ఫోన్‌ చేసి ఉరి వేసుకుంటున్నానని చెప్పాడు. బంధువులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి కొన ఊపిరితో ఉన్న ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయాడని తెలిపారు. మృతుడికి భార్య సరోజమ్మ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

దానిమ్మ కాయల దొంగలను పట్టుకున్న రైతులు

మడకశిరరూరల్‌: మండలంలో నెల రోజుల నుంచి రాత్రి సమయంలో అయ్యవారిపల్లి, బుళ్లసముద్రం, ఈచిరెడ్డి తదితర గ్రామాల్లోని దానిమ్మ తోటల్లోకి ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వెళ్లి దానిమ్మ కాయలను దొంగిలించికెళుతున్నారు. నిఘా పెట్టిన రైతులు ఆదివారం రాత్రి అయ్యవారిపల్లి వద్ద దొంగలను పట్టుకున్నారు. దానిమ్మ రైతు జయపాల్‌ తెలిపిన వివరాల మేరకు.. ఇతర ప్రాంతాలకు చెందిన ముఠాసభ్యులు రాత్రి సమయంలో తోటలోకి చొరబడి దానిమ్మ కాయలను దొంగిలించికెళుతున్నారన్నారు. ఆదివారం రాత్రి తోటలో కాయలు దొంగిలిస్తుండగా కారులో తోట వద్దకు వెళ్లగా బస్తాలు పడి వేసి పరుగులు తీశారన్నారు. రైతులు అప్రమత్తమై దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బట్టుబడిన వారిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

‘ఆపస్‌’ నూతన కార్యవర్గం

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం అనంతపురం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కళ్యాణి, ప్రధాన కార్యదర్శిగా వై.రామన్న, గౌరవాధ్యక్షుడిగా టి.నారాయణస్వామి, జిల్లా సహాధ్యక్షుడిగా పి.శివప్రసాద్‌నాయుడు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం నగరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement