‘పుర’పోరు.. జంటల జోరు | - | Sakshi
Sakshi News home page

‘పుర’పోరు.. జంటల జోరు

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

గుంతకల్లుటౌన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యామిలీ పాలిటిక్స్‌ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రజాసేవ చేయడానికి భార్యాభర్తలు వేర్వేరు వార్డుల నుంచి కౌన్సిలర్‌ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు. వైఎస్సార్‌సీపీ నుంచి రెండు జంటలు పోటీ చేస్తున్నాయి. బీసీ జనరల్‌కు కేటాయించిన 31వ వార్డులో ఆ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు బోయ తిమ్మప్ప పోటీ చేస్తుండగా, బీసీ మహిళకు కేటాయించిన 32వ వార్డు నుంచి అతని భార్య బోయ కవిత బరిలో నిలిచారు. అలాగే ఎస్‌సీ జనరల్‌కు కేటాయించిన 42వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ పట్టణ అధ్యక్షుడు మంగే నల్లన్న పోటీచేస్తుండగా, ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయిన 43వ వార్డు నుంచి అతడి భార్య మంగే నాగలక్ష్మి బరిలో దిగారు. వార్డులు వేర్వేరైనా విస్త్రృతంగా తిరుగుతూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించాలని ఓటర్ల ఆశీర్వాదం తీసుకుంటున్నారు.

31,32 వార్డుల నుంచి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులుగా బరిలో దిగిన తిమ్మప్ప, కవిత దంపతులు

పట్టణంలోని 42, 43 వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులుగా పోటీచేస్తున్న నల్లన్న, నాగలక్ష్మి దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement