హామీలు ఎంత వరకు నెరవేర్చారో చెప్పండి | - | Sakshi
Sakshi News home page

హామీలు ఎంత వరకు నెరవేర్చారో చెప్పండి

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

పెనుకొండ రూరల్‌: సూపర్‌ సిక్స్‌ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వంచించింది. స్థానిక సంస్థల్లో సూపర్‌ సిక్స్‌ మాట ఎత్తకుండా ప్రత్యర్థులపై విమర్షలు చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని, దర్గాపేట, కొత్తపేట, మెయిన్‌ బజార్‌, కోర్టు రోడ్డు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్‌ మాట్లాడుతూ గత ఎన్నికలప్పుడు ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఏడాదికి మూడు సిలిండర్లను ఎంత మందికి ఇచ్చారో చెప్పాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పేదలకు మంచి చేసే దిశగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.475 కోట్లతో పెనుకొండలో మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు చేపడితే వైఎస్సార్‌సీపీకి మంచి పేరు వస్తుందనే అక్కసుతో ఆ కళాశాల నిర్మాణాన్ని విస్మరించింది నిజం కాదా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కే. శ్రీనివాసులును చైర్మన్‌ అభ్యర్థిగా ఖరారు చేసిన తక్షణమే, వ్యక్తిపైనే కాకుండా కులం మీద టీడీపీ విష ప్రచారాలు మొదలు పెట్టిందన్నారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసి శూన్యమని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, కౌన్సిలర్‌ అభ్యర్థులు భాస్కర్‌ యాదవ్‌, బాబా పకృద్దీన్‌, సద్దాం, యాసిన్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement