బాలల హృదయాల్లో స్వరాజ్య స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

బాలల హృదయాల్లో స్వరాజ్య స్ఫూర్తి

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

ప్రశాంతి నిలయం: స్వాతంత్య్ర స్పూర్తి, ఆత్మ పరివర్తన, విలువల ఆధారిత విద్య అంశాలతో ప్రశాంతి నిలయంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సత్యసాయి పాఠశాలల 8వ జాతీయ సదస్సు ఆదివారం ముగింది. సాంస్కృతిక ప్రదర్శనలు బాలల హృదయాల్లో స్వరాజ్య స్ఫూర్తిని నింపాయి. సదస్సులో భాగంగా ఉత్తమ పనితీరు, నిబద్ధత కనబరచిన ఉపాధ్యాయులకు ఇచ్చే విశిష్ట గురుజన సమ్మాన్‌ పురస్కారాలను ఇండోర్‌కు చెందిన ఎస్‌.కె.సచ్దేవా, చైన్నెకి చెందిన కళ్యాణి సుందరరాజన్‌లకు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ చేతుల మీదుగా అందజేశారు. విద్య జ్ఞానాన్ని అందించే ప్రక్రియగానే కాకుండా మనిషిలో మానవత్వాన్ని వికసింపజేసే పరివర్తనా ప్రయాణంగా మారాలని వక్తలు సందేశాన్నిచ్చారు. అనంతరం భారతీయ స్వాతంత్య్ర సంగ్రామాన్ని, దేశ ఔన్నత్యాన్ని చాటేలా సత్యసాయి విద్యావిహార్‌ విశాఖ పట్నం విద్యార్థులు ‘స్వరాజ్‌ ఆఫ్‌ దిసోల్‌’, సత్యసాయి జ్ఞానపీఠ భద్రావతి విద్యార్థులు ‘ట్రూ ఫ్రీడమ్‌’ నాటికలను ప్రదర్శించారు.

ప్రశాంతి నిలయంలో ముగిసిన సత్యసాయి పాఠశాలల

జాతీయ సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement