విడపనకల్లు: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి ఆదివారం అధికారులు తాళం వేశారు. ప్రాదేశిక ఎన్నికల నిబంధనల ప్రకారం ఆదివారం కూడా ఎన్నికల అధికారులు కార్యాలయం తెరిచే ఉంచాలి. అయితే అధికారులు ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా కార్యాలయానికి తాళం వేయడంతో పలు పార్టీలకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవడానికి గంటల తరబడి కార్యాలయం వద్ద వేచి చూసినా .. అధికారులు రెండు గంటలైనా రాకపోవడంతో అభ్యర్థులు వెనుతిరిగారు. ఎన్నికల నిబంధనలు పాటించని ఆర్‌ఓ నరసారెడ్డిపై అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని ఏఆర్వో, మిగతా అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని నామినేషన్ వేసిన ఎంపీటీసీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.


