యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

యువకుడి మృతి

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

గాండ్లపెంట: మండల కేంద్రం సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద శనివారం కదిరి–రాయచోటి రహదారిపై బొలోరో–ద్విచక్రవాహనం ఢీ కొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు..కదిరిలోని అరవగుడిసెలకు చెందిన వెంకటేష్‌(25) బైక్‌పై వెళ్తుండగా వైఎస్సార్‌ జిల్లా వెలిగల్లు చెందిన బొలెరో వాహనం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108 వాహనంలో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సుమతి తెలిపారు.

యువకుడికి గాయాలు..

మండలంలోని కదిరి–రాయచోటి రహదారిపై శనివారం కదిరి నుంచి గాండ్లపెంటకు వెళుతున్న కారు ఎదురుగా వచ్చే ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. దీంతో ద్విచక్రవాహనంలో వచ్చే అక్బర్‌ అనే యువకుడికి కాలికి తీవ్ర గాయమైంది. యువకుడిని స్థానికులు కదిరి ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ వైఎస్సార్‌ జిల్లా చక్రాయపేటలో మద్యం షాపు నిర్వాహకుడు వెంకటమల్లప్పనాయుడుగా తేలింది. ప్రమాదానికి కారణమైన కారును డ్రైవర్‌ వదిలి పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఎస్‌ఐ సుమతి సంఘటనా స్థలానికి వెళ్లి కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

పావగడ: తాలూకాలోని రాజవంతి గ్రామం వద్ద ఉన్న నయారా పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ప్రధాన రహదారిపై రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు..పావగడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హరీశ్‌ తన కుటుంబంతో కారులో బెంగుళూరుకు బయలుదేరాడు. రాజవంతి గ్రామం వద్ద కేఎస్‌ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్‌ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొన్నాడు. ఘటనలో కార్లు నుజ్జునుజ్జవడంతోపాటు వాటిని నడుపుతున్న ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరినీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తర్వాత వైద్యుల సూచనల మేరకు తమకూరుకు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement