ఘనంగా లక్ష్మీరంగనాథ స్వామి ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా లక్ష్మీరంగనాథ స్వామి ఉత్సవం

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

అగళి: నరసంబూది గ్రామంలో వెలసిన లక్ష్మీరంగనాథస్వామి ఉత్సవం శనివారం ఘనంగా జరిగింది. వేకువజామునే స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం వెండి ఆభరణాలతో పాటు భక్తులు అందజేసిన వివిధ రకాల పూలతో అలంకరించి మంగళహారతి ఇచ్చారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి మేళతాళాల నడుమ ఊరేగించారు. మహిళలు బియ్యం పిండితో చేసిన జ్యోతులను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామికి సమర్పించారు. ఇలా చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, సంతానం లేనివారికి సంతానం ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement