రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి దుర్మరణం

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

తనకల్లు: చీకటిమానిపల్లి–బొంతలపల్లి మార్గంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. మరో ఉపాధ్యాయుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు..బొంతలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంటుగా నాగభూషణం(50),తెలుగు ఉపాధ్యాయుడిగా జాఫర్‌హుస్సేన్‌ పని చేస్తున్నారు. వీరు రోజూ కదిరి నుంచి చీకటిమానిపల్లికి బస్సులో వచ్చి అక్కడి నుంచి ఒకే బైక్‌పై పాఠశాల వెళ్లేవారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని బైక్‌పై ఇద్దరూ చీకటిమానిపల్లికి బయలుదేరారు. అయితే గ్రామం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీ కొంది. ఈ ప్రమాదంలో నాగభూషణం బైక్‌పై నుండి రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తెలుగు ఉపాధ్యాయుడు జాఫర్‌హుస్సేన్‌కు బలమైన గాయాలయ్యాయి. మరో బైక్‌లో వస్తున్న మహమ్మదాబాద్‌కి చెందిన సలీమ్‌బాషా స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులు జాఫర్‌ హుస్సేన్‌, సలీమ్‌బాషాను చికిత్స కోసం తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం జాఫర్‌ను వైద్యుల సలహా మేరకు కదిరికి అక్కడి నుంచి అనంతపురం తరలించారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరో ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement