మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. శనివారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. అభివృద్ధి చేసే వారికే పట్టం కట్టాలని కోరారు. కదిరిలో చైర్‌పర్సన్ అభ్యర్థి అత్తార్ పర్వీన్, మడకశిర 11వ వార్డులో వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి ఓంకుమార్, స్థానిక వార్డు అభ్యర్థి రమణమ్మతో కలిసి ప్రచారం చేయగా... ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. అలాగే ధర్మవరంలోనూ వైఎస్సార్‌సీపీ ధర్మవరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కాచర్ల అంజి పలువార్డుల్లో ప్రచారం నిర్వహించారు. హిందూపురంలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి ధర్మవరం షాజియా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజలే ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు.
– సాక్షి నెట్‌వర్క్


