మానవతా విలువలతోనే విద్యార్థి ప్రగతి | - | Sakshi
Sakshi News home page

మానవతా విలువలతోనే విద్యార్థి ప్రగతి

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

ప్రశాంతి నిలయం: ఆధ్యాత్మికత, మానవతా విలువలతో కూడిన విద్యనందిస్తూ విద్యార్థిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దడమే సత్యసాయి విద్యా విధానం లక్ష్యమని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌ రాజు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి విద్యాసంస్థల 8వ జాతీయ సదస్సు శనివారం ప్రశాంతి నిలయంలో ప్రారంభ మైంది. రెండురోజులపాటు సాగనున్న సదస్సులో దేశ వ్యాప్తంగా ఉన్న 104 పాఠశాలలకు సంబంధించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొంటున్నారు. శనివారం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యులు, సేవా సంస్థల, విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి ఆర్‌జె రత్నాకర్‌ రాజు జ్యోతిప్రజ్వలనతో సదస్సును ప్రారంభించారు. అంతకుముందు ఉదయం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ట్రస్ట్‌ సభ్యులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి విద్యాసంస్థల ప్రతినిధులు... సత్యసాయి విద్యాసంస్థల విద్యా విధానం, సత్యసాయి విద్యా ఉద్యమం సాగిన క్రమాన్ని వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం ప్రశాంతి నిలయంలోని సత్సంగ్‌ హాలులో సత్యసాయి బోధనలు, విద్య పట్ల ఆయన ఆలోచనా విధానాలను ప్రతిబింబిస్తూ పలు ఘట్టాలను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

సాయంత్రం ఇండోర్‌కు చెందిన సత్యసాయి విద్యావిహార్‌ విద్యార్థులు నిర్వహించిన సంగీత విభావరి మైమరపింపజేసింది.

సత్యసాయి విద్యాసంస్థల లక్ష్యమిదే

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌.జె. రత్నాకర్‌ రాజు

ప్రారంభమైన సత్యసాయి విద్యాసంస్థల 8వ జాతీయ సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement