జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా వజ్ర భాస్కర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా వజ్ర భాస్కర్‌రెడ్డి

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

కదిరి టౌన్‌: జిల్లా పరిషత్‌ వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా నల్లచెరువు జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలో నిలిచిన కె.వజ్ర భాస్కర్‌రెడ్డిని ప్రతిపాదిస్తూ ఆ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ అధిష్టానానికి ఓ లేఖ పంపారు. పార్టీ కోసం వజ్రభాస్కర్‌రెడ్డి చేసిన సేవలు, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి అందించిన సహకారం, సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఆయన పేరును ప్రతిపాదించినట్లు వారు ‘సాక్షి’కి వెల్లడించారు.

పార్టీ బలోపేతానికి విశేష కృషి..

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ యాక్టివిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వజ్ర భాస్కర్‌రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ పార్టీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పట్ల అంకిత భావం, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం తదితర అంశాలను అధిష్టానానికి మరోసారి గుర్తు చేస్తూ ఆయన పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది.

సేవా కార్యక్రమాల్లోనూ ముందంజ..

వజ్రభాస్కర్‌రెడ్డి రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు చేరువయ్యారు. ‘వజ్ర’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించడం, పేదలకు తక్కువ ఖర్చుతో భోజనం అందిస్తూ అందరికీ చేరువయ్యారు.

అధిష్టానానికి పేరు ప్రతిపాదించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement