టీడీపీతో అంటకాగుతున్న కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

టీడీపీతో అంటకాగుతున్న కమిషనర్‌

Oct 23 2026 1:39 AM | Updated on Oct 23 2026 1:39 AM

హిందూపురం(చిలమత్తూరు): హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. గురువారం టీడీపీ నేత, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ డీఈ రమేష్‌ కుమారుడి పెళ్లికి ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర వచ్చారు. టీడీపీ నేతలతో కలిసి కమిషనర్‌ మల్లికార్జున సైతం కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి పీఎస్‌ మంజునాథ్‌ కమిషనర్‌ను వెంట బెట్టుకొని వెళ్లి మరీ ఫొటో దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కమిషనర్‌ మల్లికార్జున తొలి నుంచి ఎమ్మెల్యే బాలకష్ణ, ఆయన పీఏలకు విధేయుడిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారు ఏం చెబితే అది చేస్తూ కండువా వేసుకోని టీడీపీ కార్యకర్తగా పని చేస్తున్నారని ఆపార్టీ నాయకులే చెబుతున్నారు. ఎన్నికల అధికారిగా ఉంటూ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నా ఇలా అధికార పార్టీ నేతలతో తిరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కమిషనర్‌ను తొలగించి మరొకరిని నియమించాలని వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి డిమాండ్‌ చేశారు. ఇలాంటి అధికారులు ఉన్న చోట ఎన్నికలు పారదర్శకంగా జరగవని ఆయన స్పష్టం చేశారు.

మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కుమారుడి పెళ్లిలో టీడీపీ నేతలతో కలిసి సందడి

ప్రజలకు ఏమి మెసేజ్‌ ఇస్తున్నట్టు..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement