సీఐఐ సదస్సు నిర్వహణలో లోటుపాట్లు తలెత్తరాదు | - | Sakshi
Sakshi News home page

సీఐఐ సదస్సు నిర్వహణలో లోటుపాట్లు తలెత్తరాదు

Oct 23 2026 1:39 AM | Updated on Oct 23 2026 1:39 AM

అనంతపురం: జేఎన్‌టీయూఏ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న కాన్ఫిడరేషన్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ – 2026 (సీఐఐ)లో ఎలాంటి లోటుపాట్లు తలెత్తరాదని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. జేఎన్‌టీయూఏలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో రీజనల్‌ కాన్ఫరెన్స్‌ కోసం చేపట్టిన ఏర్పాట్లను గురువారం జేసీ సి.విష్ణుచరణ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయాష్‌కుమార్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీలించి మాట్లాడారు. డెలిగేట్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ఏపీ పెవిలియన్‌ ఎండ్‌ నుంచి 4 జిల్లాల్లో ప్రాముఖ్యత కలిగిన ఉత్పత్తుల ప్రదర్శన చేపట్టాలన్నారు. ఎంఎస్‌ఎంఈ స్టాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. పెట్టుబడిదారులు, ప్రతినిధులు, విధాన రూపకర్తలు ప్రధానంగా ఏరోస్పేస్‌–డిఫెన్స్‌, ఆటోమోటివ్‌, ప్రకృతి వ్యవసాయం, హార్టికల్చర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పునరుత్పాదక శక్తి వంటి కీలక రంగాలపై చర్చించనున్నారన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసయాదవ్‌, ఏపీఐఐసీ జెడ్‌ఎం నాగకుమార్‌, ఆర్డీఓ ప్రేమంతకుమార్‌, ఐఅండ్‌పీఆర్‌ డీఐపీఆర్‌ఓ ఏ.బాలకొండయ్య, పరిశ్రమల శాఖ ఏడీ రాజశేఖర్‌ రెడ్డి, డీఎస్‌ఓ శోభారాణి పాల్గొన్నారు.

అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దు

అనంతపురం న్యూ టౌన్‌: స్థానిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పరిశీలకులు ఎన్నికల అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను గురువారం జనరల్‌ పరిశీలకులు బి.స్మరణ్‌రాజ్‌, జిల్లా వ్యయ పరిశీలకులు సుబ్బరాజు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement