హిందూపురం టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధి నామినేషన్‌ను అభ్యర్ధితో పాటు, ప్రతిపాదకుడు విత్‌డ్రా చేయకుండా చేసినట్లు ఎన్నికల అధికారులు చూపడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఒకటవ వార్డుకు వెంకటరంగప్ప నామినేషన్ దాఖలు చేశాడు. ఆ స్థానం కూటమి సర్దుబాటులో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో వెంకటరంగప్ప స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచాడు. దీంతో టీడీపీ అధిష్టానం అతడ్ని సస్పెండ్ చేసింది. ఇదీ అంతా ఒక ఎత్తు అయితే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన వెంటరంగప్ప నామినేషన్ విత్‌డ్రా జరిగినట్లు సహాయ ఎన్నికల అధికారి ప్రకటించారు. దీనిపై వెంకటరంగప్ప ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించడానికి మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. కమిషనర్ అందుబాటులోకి రాకపోవడంతో నిరసన తెలపడానికి ప్రయత్నించిన వారిని, పోలీసులు అడ్డుకుని, అక్కడి నుంచి పంపించి వేశారు. దీనిపై వెంకటరంగప్ప మాట్లాడుతూ తన నామినేషన్‌న్‌ను ఉపసంహరించినట్లు నమోదు చేశారని ఆరోపించారు. తనతో పాటు తన నామినేషన్‌న్‌కు ప్రతిపాదకులుగా ఉన్నవారు ఎవరూ అక్కడ లేకుండానే నామినేషనన్ ఉపసంహరణ జరిగినట్లు అధికారులు చూపించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులను ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదన్నారు. ఒకటో వార్డు నామినేషన్‌న్ ఉపసంహరణ ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరణ నమోదు చేసినట్లు తేలితే ఆ ప్రక్రియను రద్దు చేసి, తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఉపసంహరణ చేయకుండానే
చేసినట్లు చూపిన అధికారులు


