● ఎండిన ఆశలు | - | Sakshi
Sakshi News home page

● ఎండిన ఆశలు

Sep 11 2026 8:22 AM | Updated on Sep 11 2026 8:22 AM

ప్రకృతికి ఎదురొడ్డి పంటలు సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎల్‌–నినో కారణంగా తీవ్ర వర్షాభావం నెలకొన్నా...కొందరు రైతులు బోర్ల కింద వేరుశనగ సాగు చేశారు. అందులో ధర్మవరం మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన బోసల మురళీ కూడా ఒకరు. మూడు ఎకరాల్లో రూ.1.50 లక్షలు ఖర్చుచేసి వేరుశనగ సాగుచేశాడు. అయితే పంట కాయదశకు చేరుకునే సమయంలో బోరు బావిలో నీరు అడుగంటిపోయింది. కళ్లముందే పంట ఎండుతుండగా..ఏం చేయాలో తెలియని మురళి కనీసం పశువుల మేతకై నా పనికి వస్తుందని గురువారం ఇలా పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. కనీసం ఒక్క పదునైన వర్షం వచ్చినా పంట దక్కేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని, ఆరుగాలం కుటుంబమంతా శ్రమిస్తే అప్పులే మిగిలాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

– ధర్మవరం రూరల్‌:

ఎండిన వేరుశనగ పంటను ట్రాక్టర్‌తో తొలగించుకుంటున్న రైతు బోసల మురళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement