ప్రశాంతి నిలయం: వివిధ ప్రాంతాల నుంచి ప్రశాంతి నిలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ‘ప్రశాంతి పాత్ ఫైండర్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. గురువారం యాప్‌ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్ రాజు ఆవిష్కరించారు. భక్తులు ప్రశాంతి నిలయంలో తాము చేరుకోవాల్సిన ప్రదేశానికి యాప్ ద్వారా సులువుగా చేరుకోవచ్చన్నారు. యాప్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్రశాంతి నిలయంలోని 12 లొకేషన్లను చేరుకోవడానికి వెళ్లే రూట్‌మ్యాప్ అందుబాటులోకి వస్తుందన్నారు.


