గోరంట్ల: మ్యుటేషన్ దరఖాస్తులన్నీ గడువులోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన గోరంట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది, అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో జరుగుతున్న సమగ్ర భూసర్వే పురోగతిపై ఆరా తీశారు. సర్వే ప్రక్రియలో సరిహద్దు వివాదాలకు తావులేకుండా పక్కా ఆధారాలతో రికార్డులను సిద్ధం చేయాలని వీఆర్‌ఓలు, సర్వేయర్లను ఆదేశించారు. అర్జీదారుల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలన్నారు. రికార్డులు పక్కాగా ఉండాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ వెంట తహసీల్దార్ మధుసూదన్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐలు సర్వేయర్లు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
అధికారులకు జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశం


