పెనుకొండ రూరల్: అక్రమంగా తరలిస్తున్న 45 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై వచ్చిన సమాచారం మేరకు గురువారం రాత్రి విజిలెన్స్, రెవెన్యూ అధికారులు పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో గుట్టూరు వైపు నుంచి బెంగళూరుకు వెళ్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా...45 క్వింటాళ్ల రేషన్ బియ్యం కనిపించాయి. దీంతో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న సోమందేపల్లికి చెందిన మోహన్‌కుమార్, నరేష్, బాషాపై కేసు నమోదు చేశారు. అనంతరం రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పౌరసరఫరాల శాఖ గోడౌన్‌కు తరలించినట్లు ఇన్‌చార్జ్ సీఎస్‌డీటీ శ్రీధర్ తెలిపారు.


