పరిగి: ‘‘సర్ ప్రక్రియలో భాగంగా మీరు సమర్పించిన వివరాలు సరిగా లేవు. మీ ఓటు తుది జాబితాలో ఉండాలంటే విచారణ అధికారుల ముందుకు హాజరు కావాలి. లేకపోతే మీ ఓటు రద్దు చేస్తాం’’ అని పేర్కొంటూ పరిగి జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరామప్పకు అధికారులు బుధవారం నోటీసులిచ్చారు. ఇలా జిల్లాలోని వేలాది మందికి అధికారులు నోటీసులిస్తున్నారు. దీనిపై జెడ్పీటీసీ శ్రీరామప్ప అభ్యంతరం తెలిపారు. జెడ్పీటీసీగా ఆశేష మెజార్టీతో ఎన్నికై న తనపేరునే అధికారులు తొలగించారంటే మిగతా వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. తన పూర్తి వివరాలు, తగిన ఆధారాలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన తర్వాతే తనకు జెడ్పీటీసీగా పోటీచేసే అవకాశం కల్పించారని, ఆ తర్వాత తాను భారీ మెజార్టీతో జెడ్పీటీసీగా ఎన్నికయ్యాయనన్నారు. అప్పుడు తాను సమర్పించిన దరఖాస్తులు అధికారులు తొలగించి ఇప్పుడు నోటీసులిచ్చారన్నారు. ఇవన్నీ గమనిస్తుంటే వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. రెవెన్యూ అధికారులు, బీఎల్‌ఓలు, స్థానిక కూటమి నాయకుల ప్రోద్భలంతో తన పేరు ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మండల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు.
‘సర్’ ప్రక్రియలో భాగంగా నోటీసులిచ్చిన అధికారులు
ప్రజాప్రతినిధిగా ఎన్నికై న తన ఓటుపై అభ్యంతరమేమిటని
ప్రశ్నించిన జెడ్పీటీసీ శ్రీరామప్ప


