దొంగలంతా ‘పచ్చ’ నేతలే | - | Sakshi
Sakshi News home page

దొంగలంతా ‘పచ్చ’ నేతలే

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా అరికట్టి సహజ వనరులను కాపాడాం. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణా అధికమైంది. ఇసుక దొంగలంతా తెలుగు తమ్ముళ్లే. అందుకే అధికారులు ఏం చేయలేకపోతున్నారు. ఇక్కడి ఇసుకను కర్ణాటకకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎల్‌–నినో ప్రభావం తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇసుక తవ్వకాలతో భూగర్భజలమట్టం భారీగా పడిపోతుందని తెలిసినా ఇసుకాసురులు వెనక్కు తగ్గడం లేదు. ఇసుక, మట్టి అక్రమ రవాణాపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాం.

– టీఎన్‌ దీపిక, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, హిందూపురం

బోరుబావుల్లో నీరు తగ్గిపోతోంది

మా గ్రామం పెన్నానది ఒడ్డునే ఉంటుంది. నాతోపాటు నదీ తీర గ్రామాల్లోని రైతులందరూ బోరు బావుల్లోని నీటితో పంటలు సాగు

చేసేవాళ్లం. అయితే ప్రస్తుతం పెన్నాలో ఇసుక కోసం టీడీపీ నేతలు భారీగా తవ్వకాలు చేపట్టారు. దీంతో భూగర్భజలమట్టం పడిపోయి బోర్లు ఎండిపోయాయి. పంటను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. ఇప్పటికైనా మైనింగ్‌, ఇరిగేషన్‌ అధికారులు, పోలీసులు ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలి.

– రాము, సంతెబిదనూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement