రైతుకు బిడ్డయినా.. పంటయినా ఒక్కటే. బిడ్డ ఎదిగితే మురిసిపోతాడు...పైరు పెరిగితే సంబరపడతాడు. పంటకేమైనా బిడ్డకే అయినట్లు బాధపడతాడు. అలాంటి రైతుల్లో ఓడీచెరువు మండలం మలకవారిపల్లికి చెందిన హనుమంతరెడ్డి ఒకరు. జూన్‌లో మోస్తరు వర్షానికే రూ.లక్షలు అప్పుచేసి వేరుశనగ వేశాడు. మొక్క మొలచినా ఆ తర్వాత వరుణుడి జాడలేకపోయింది. మూడు నెలలుగా చినుకు నేలరాలక బోర్లలోనూ నీళ్లు ఇంకిపోయాయి. కళ్లముందే పంట ఎండిపోతుండటంతో ఏం చేయాలో తెలియని రైతు బుధవారం ఇలా పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. బిడ్డను పోగొట్టుకున్న తండ్రిలా సాయంత్రం వేళ విచారంగా ఇంటిదారిపట్టాడు. ఎల్–నినో ప్రభావంతో నెలకొన్న కరువుకు ఈ చిత్రం అద్దం పట్టింది. – ఓడీచెరువు:


