కదిరి టౌన్: పరాభవ నామ సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని, వర్షాలు మధ్య రకంగా కురిసినా.. పంటలు మాత్రం సమృద్ధిగా పండుతాయని శివాలయ అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా గురువారం రాత్రి కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. ఊంజల్ సేవ అనంతరం పంచాంగాన్ని అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ చదివి వినిపించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ వీవీఎస్ శర్మ, డీఎస్పీ శివనారాయణస్వామి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


