హిందూపురం: మండలంలోని చౌళూరు గ్రామ సమీపంలో ఉన్న పెన్నానది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి (40) మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కాగా, కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, కల్లు తాగేందుకు వచ్చి ఉంటాడనే అనుమానాలను వ్యక్తమయ్యాయి. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి పోలీసులు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


