మడకశిర రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన తిప్పేస్వామి(19), చంద్రమౌళి గురువారం బుళ్లసముద్రం వైపు నుంచి మడకశిర వైపుగా ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. అయ్యవారిపల్లి సమీపంలోకి చేరుకోగానే 544ఈ జాతీయ రహదారిపై మలుపు వద్ద ఉన్నఫళంగా కారు దూసుకువచ్చి ఢీకొనడంతో తిప్పేస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన చంద్రమౌళిని చికిత్స నిమిత్తం హిందూపురానికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


