ఎస్కేయూ వీసీగా జ్యోతి కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్కేయూ వీసీగా జ్యోతి కుమార్‌

Mar 14 2026 8:37 AM | Updated on Mar 14 2026 8:37 AM

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) నూతన వైస్‌ చాన్సలర్‌గా ప్రొఫెసర్‌ ఎన్‌వీఆర్‌ జ్యోతి కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్‌/ చాన్సలర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌వీఆర్‌ విజయ్‌కుమార్‌ మిజోరాం యూనివర్సిటీలో కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 39 సంవత్సరాల బోధనానుభవం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఎస్కేయూకు శాశ్వత వీసీ నియామకం జరిగింది. 18 నెలలుగా ఇన్‌చార్జ్‌ వీసీతోనే ఎస్కేయూ కార్యకలాపాలు జరిగాయి. ఎస్కేయూ ఇన్‌చార్జ్‌ వీసీగా ప్రొఫెసర్‌ బి.అనిత ఎక్కువ కాలం పనిచేసి రికార్డు సృష్టించారు.

ఆటో ఢీకొని

వృద్ధురాలి మృతి

గుడిబండ: మండల పరిధిలోని కేకాతి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగమ్మ (67) మృతి చెందింది. వివరాల్లోకెళితే... వృద్ధురాలు రంగమ్మ శుక్రవారం గ్రామంలోని గుడి వద్ద నుంచి ఇంటికి నడుస్తూ వస్తోంది. అయితే మైనగానపల్లి గ్రామానికి చెందిన హనుమంతు ఆటోతో రంగమ్మను ఢీ కొన్నాడు. వృద్ధురాలు రంగమ్మ తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె చిన్న కుమారుడు మంజునాథ్‌ వెంటనే మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హిందూపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రంగమ్మ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజ్‌కుళ్లాయప్ప తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి దుర్మరణం

రొళ్ల: రోడ్డుకు అడ్డంగా కుక్క అడ్డురావడంతో తప్పించబోయి వాహనం అదుపుతప్పి కింద చంద్రశేఖర్‌ (59) అనే వ్యక్తి దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం అగళి మండలం కురసాంగనపల్లికి చెందిన చంద్రశేఖర్‌ మడకశిర మండలం నీలకంఠాపురంలోని కంటి ఆస్పత్రికి ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. రొళ్లకొండ టోల్‌ప్లాజా దాటిన తర్వార కొడగార్లగుట్టకి వెళ్లే మలుపు వద్ద 544ఈ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డువచ్చింది. దాన్ని తప్పించబోయి చంద్రశేఖర్‌ అదుపుతప్పి కింద పడ్డారు. చంద్రశేఖర్‌ తలకు బలమైన రక్త గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు హైవే అంబులెన్స్‌ సహాయంతో రొళ్ల సీహెచ్‌సీకి తరలిస్తుండగా చంద్రశేఖర్‌ మార్గమధ్యలోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గౌతమి, ఏఎస్‌ఐ ఇదాయితుల్లా ఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement