కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నదాత సుఖీభవ పథకానికి నమోదు చేసుకునేందుకు సైట్ ఓపెన్ కాలేదు. దీంతో నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఎన్నికలప్పుడు సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తామని చెప్పి మోసం చేశారు. నేను ఈఏడాది రూ.20 వేలు నష్ట పోయాను. వరుస నష్టాలు..పెట్టుబడికి చేతిలో డబ్బులేదు. పంటలు ఏవిధంగా సాగు చేయాలో తెలియడం లేదు. ఇప్పటికై నా నాకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం వర్తించేలా చూడాలి. – అక్కిం శంకర, ఉప్పార్లపల్లి,
నల్లచెరువు మండలం
రూ.20 వేలు ఇవ్వాలి
ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా రాష్ట్రంలోని ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు పెట్టుబడి సాయం అందజేయాలి. మొదటి ఏడాది మాకు డబ్బులు అందలేదు. ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు మాత్రమే అందుతోంది. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు రూ.20 వేలు ఖాతాల్లో జమ చేయాలి. ఈ ఏడాది పంటలు సరిగా పండలేదు. రైతుల ఇబ్బంది గుర్తెరగాలి.
– ప్రకాష్, రైతు,
తమ్మడేపల్లి, అమరాపురం మండలం.
మరోసారి నమోదు చేసుకోవచ్చు
అర్హత ఉండీ ఎవరికై నా అన్నదాత సుఖీభవ పథకం వర్తించకపోతే అలాంటి రైతులు మరోసారి నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం. ఆయా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సైట్ ఓపెన్ కాగానే నమోదు చేస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ–కేవైసీ చేయని వారు, ఎన్‌పీసీఐకి బ్యాంకు ఖాతాను లింక్ చేయని రైతులు త్వరగా ఆ పని పూర్తి చేయాలి.
– కృష్ణయ్య, జిల్లా వ్యవసాయాధికారి


