హిందూపురం: గత ఏడాది జూలైలో హిందూపురం మండలం కిరికెరలోని వెంకటాద్రి లే అవుట్ వద్ద సిమెంట్ వ్యాపారి నిత్యానందారెడ్డి ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అదే నెలలో ధర్మవరానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ సిక్ బాజాపీరాను పోలీసులు అరెస్ట్ చేసి మొత్తం తొమ్మిది కేసులకు సంబంధించి 201.6 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం రూరల్ అప్‌గ్రేడ్ పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ మహేష్ వెల్లడించారు. సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐలు మునిప్రతాప్, మునీర్ అహమ్మద్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రైం బృందం ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ నిందితులను అరెస్ట్ చేసి తీసుకువచ్చినట్లు వివరించారు. పట్టుబడిన వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పఠాన్ హైదర్ అలీ, ఇమ్రాన్ అలీఖాన్ ఉన్నారన్నారు. వీరి నుంచి 5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐలు ఆంజనేయులు, రాజగోపాలనాయుడు, అబ్దుల్‌కరీం పాల్గొన్నారు.
5 తులాల బంగారు నగలు స్వాధీనం


