నేడు మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేడు మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలు

Mar 7 2026 7:18 AM | Updated on Mar 7 2026 7:18 AM

పుట్టపర్తి టౌన్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పుట్టపర్తిలోని కర్టాటకనాగేపల్లి మార్గంలో ఉన్న అమూల్య విల్లాస్‌ క్రీడా మైదానంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మహిళా ఉద్యోగులకు పాటలు, క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు లింగా రామ్మోహన్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలందరూ పాల్గొనవచ్చు. విజేతలకు ఆదివారం ఆర్‌వీజే కల్యాణమంటపంలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో బహుమతులు ప్రదానం చేయనున్నారు.

దేవతా ప్రతిమల ధ్వంసం కేసులో నిందితుడి అరెస్ట్‌

కదిరి టౌన్‌: స్థానిక మున్సిపల్‌ పరిధిలోని కుమ్మరోళ్లపల్లిలో ఉన్న రాములు గుడి వద్ద సిమెంట్‌తో తయారు చేసిన ఆంజనేయస్వామి, గరుత్మంతుడి ప్రతిమలను ధ్వంసం చేసిన కేసులో మూర్తిపల్లికి చెందిన కుంచపు వెంకటేష్‌ను అరెస్ట్‌ చేసినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. గుడి గోపురం, అర్చ్‌ నిర్మాణంలో ఆంజనేయస్వామి, గరుత్మంతుడి ప్రతిమలను సిమెంట్‌తో చేసేలా వెంకటేష్‌తో ధర్మకర్తలు ఒప్పందం చేసుకున్నారన్నారు. అయితే పనులు ముగిసిన తాను చేసిన పనికి ధర్మకర్తలు డబ్బు ఇవ్వకపోవడంతో పాటు మిగులు పనిని ఇతరులకు అప్పగించడంతో అక్కడున్న ప్రతిమలను ధ్వంసం చేశాడని వివరించారు. ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పక్కా ఆధారాలతో శుక్రవారం నిందితుడు వెంకటేష్‌ను అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

రాత్రి వేళ అక్రమంగా

ఇసుక తరలింపు

అగళి: మండలంలోని సువర్ణముఖి వంక నుంచి అక్రమంగా రాత్రి వేళ ఇసుక దందా ఆగడం లేదు. ఇరిగేపల్లి, మధూడి, బొమ్మసానిపల్లి తదితర గ్రామాల పరిధిలో 12 కిలోమీటర్ల మేర సువర్ణముఖి వంక ఉంది. ఆయా ప్రాంతాల్లోని వంక నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేయడంతో భారీగా గోతులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరుతో అక్రమంగా కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. .దీంతో సువర్ణముఖి వంక పరివాహక ప్రాంతంలో బోర్లు ఎండిపోయి వందలాది ఎకరాలు బీళ్లుగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెండి రథంపై ఊరేగిన లక్ష్మీనృసింహస్వామి

రొళ్ల: మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి పూల పల్లకీ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన వెండి రథంపై లక్ష్మీనృసింహస్వామి ఉత్సవ మూర్తిని అధిష్టింపజేసి పురవీధుల్లో ఊరేగించారు. అంతకు ముందు వేకువజామున సుప్రభాత సేవలు, అభిషేకాలు పెద్ద ఎత్తున జరిగాయి. మూలవిరాట్‌ను వెండి, బంగారు ఆభరణాలు, పూలతో విశేష అలంకరణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి దేవత సంకీర్తన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

చెన్నకేశవుడికి శయనోత్సవం

యాడికి: మండల కేంద్రంలో వెలసిన శివలక్ష్మీ చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శయనోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి పది గంటలకు ఉత్సవ మూర్తులకు శయనోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement