పంచాయతీలకు నిధులివ్వండి
పుట్టపర్తి అర్బన్: ‘‘ఆర్థిక ఇబ్బందులతో పంచాయతీలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. కనీసం తాగునీటి సరఫరా, పారిశుధ్య చర్యలకూ డబ్బులు లేక సర్పంచ్‌లు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాజకీయ కక్షతో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా ఉన్న పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంతవరకూ విడుదల చేయలేదు. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు కూడా చెల్లించలేదు. ఇకనైనా నిధులు మంజూరు చేయండి’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను కోరారు. సోమవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆమె పలువురు సర్పంచులతో కలిసి కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతకరం ఆమె మాట్లాడుతూ.. బాధ్యతగల మంత్రి స్థానంలో సవిత పెనుకొండ నియోజకవర్గంలోని పంచాయతీలకు నిధుల కాకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. సంబంధిత అధికారులను బెదిరించి వైఎస్సార్‌సీపీ సర్పంచులకు సంబంధించిన బిల్లులను నిలిపి వేయించారన్నారు. వైఎస్సార్‌సీపీ సర్పంచులు టీడీపీ కండువా వేసుకుంటే బిల్లులు చెల్లిస్తామని మంత్రి అనుచరులు చెబుతున్నారన్నారు. ఇందుకు నిదర్శనంగా పరిగి మండలం బీచిగానిపల్లిలో వర్క్ ఆమోదం లేకున్నా.. మంత్రికి అనుకూలంగా ఉండటంతో సదరు పంచాయతీలో బిల్లులు చెల్లించారన్నారు. మంత్రి చర్యలతో గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. సర్పంచుల నిధుల విషయంలో జోక్యం చేసుకుంటున్న మంత్రి సవిత, ఓఎస్‌డీ సుమన జయంతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటికై నా కలెక్టర్, డీపీఓ స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులు
వెంటనే మంజూరు చేయాలి
కలెక్టర్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్
గురు శిష్యుల చీకటి ఒప్పందంతో
సీమకు అన్యాయం
గురుశిష్యులైన ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందంతో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. సోమవారం ఆమె కలెక్టరేట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. బాబు, రేవంత్ చీకటి ఒప్పందం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బహిర్గతమయినా.. ఇప్పటి వరకూ చంద్రబాబు నోరు మెదపలేదంటే సీమకు ఎంత ద్రోహం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మంగళం పాడిన చంద్రబాబును ఈ ప్రాంత ప్రజలు క్షమించరన్నారు. రాయలసీమను రతనాల సీమగా చూడాలన్న సంకల్పంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ రాయలసీమ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.7 వేల కోట్లు మంజూరు చేశారన్నారు. అయితే చంద్రబాబు సీమ నుంచి సీఎంగా ఉండి.. ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారన్నారు. పక్క రాష్ట్రం వద్ద సీమ ఎత్తిపోతల పథకాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. సీమకు ద్రోహం చేస్తే రైతులు క్షమించరన్నారు. దీన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళతామన్నారు.


