‘టెట్’ నుంచి మినహాయించాలి
పుట్టపర్తి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయం ఆవరణలో నూతన సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను డీఈఓ కృష్ణప్ప చేతుల మీదుగా వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తున్న వారికి సైతం టెట్ పేరుతో ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే ఈ విధానాలను వీడాలని, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి, మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలా ఇంద్ర ప్రసాద్, నేతలు శ్రీనివాసరెడ్డి, గంగిశెట్టి, రాజేష్, మల్లికార్జున, రామమోహన్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డి, హర్ష, రాజశేఖర్, సుబ్బారెడ్డి, ప్రకాష్‌రెడ్డి, సుభాష్ నాయక్, సునీత, సుధారాణి, రామిరెడ్డి, కృష్ణమ్మ, సుజాత, నర్మద, శమంతకమణి, ఇందిర, మహేశ్వరరెడ్డి, బయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌టీఎఫ్ డిమాండ్


