ధర్మవరం కుడి కాలువ రెడీ
కూడేరు: మండలంలోని జల్లిపల్లి వద్ద తెగిన ధర్మవరం కుడికాలువ గట్టుకు మరమ్మతు పనులు పూర్తయినట్లు డీఈ విశ్వనాథరెడ్డి, జేఈ సుబ్రహణ్యం తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్ 7న కుడి కాలువ గట్ట కోతకు గురై పూర్తిగా తెగిందన్నారు. దీంతో అదే నెల 16న రూ.90 లక్షల నిధులతో మరమ్మతు పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయగలిగామన్నారు. ఈ క్రమంలోనే కాలువ గట్టు సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పీఏబీఆర్ ఎస్కేప్ రెగ్యులేటర్ వద్ద మిడ్ పెన్నార్‌కు మళ్లించిన 400 క్యూసెక్కుల నీటిని కుడికాలువకు మళ్లించినట్లు వివరించారు. దీంతో ఎక్కువ నీరు విడుదల చేసిన సమస్య ఉండదని స్పష్టత వచ్చిందన్నారు.
అడవిలో ఆరని మంటలు
పెనుకొండ: స్థానిక అటవీ ప్రాంతంలో మంటలు ఆరడం లేదు. ఏదో ఒక ప్రాంతంలో మంటలు రగులుతూనే ఉన్నాయి. మంగళవారం స్థానిక దొడ్డికుంట సమీపంలో మంటలు ఎగిసి పడుతుండడంతో రోడ్డున వెళుతున్న ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేసారు.
బంక్‌లోకి దూసుకెళ్లిన కారు
రొళ్ల: మండలంలోని హొట్టేబెట్ట పంచాయతీ సమీపంలో కర్ణాటకలోని లక్ష్మీపురం వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా 544ఈ జాతీయ రహదారి పక్కన బతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్న బంక్‌లోకి ఓ కారు దూసుకెళ్లింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బంక్ వద్ద జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బంక్ పక్కనే బండరాళ్లు పాతి ఉండడంతో కారు ఢీకొని ఆగిపోయింది. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. ఘటనపై కర్ణాటకలోని మిడిగేశి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ప్రతి బిడ్డకూ టీకా తప్పనిసరి
పుట్టపర్తి అర్బన్: నవజాత శిశువు మొదలు మొదటి ఏడాది పూర్తయ్యే వరకూ ప్రతి బిడ్డకూ టీకా తప్పని సరిగా వేయాలని సిబ్బందికి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సురేష్‌బాబు సూచించారు. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు పీహెచ్‌సీలో మంగళవారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యాధి నిరోధక టీకాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. అసంక్రమిత, సంక్రమిత వ్యాధుల సర్వే సక్రమంగా నిర్వహించాలన్నారు. క్షయ వ్యాధి లక్షణాలున్న వారికి గల్ల పరీక్ష నిర్వహించాలన్నారు. ఈ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ నివేదిత, సీహెచ్‌ఓలు వన్నప్ప, పార్వతి, హెల్త్ ఎడ్యుకేటర్ లక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు?
పుట్టపర్తి టౌన్: స్థానిక హంద్రీ–నీవా కాలువలో కొత్తచెరువు మండలం తిప్పబాట్లపల్లికి చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి మహేష్ చౌదరి (35) మృతదేహం లభ్యమైన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తన కుమారుడి మృతిపై తల్లి నాగరత్నమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తూ చేసిన ఫిర్యాద మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం సాయంత్రం ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. నేడో, రేపో వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.
ధర్మవరం కుడి కాలువ రెడీ
ధర్మవరం కుడి కాలువ రెడీ
ధర్మవరం కుడి కాలువ రెడీ


