తండ్రిబాటలోనే కుమార్తెలు
శాసీ్త్రయ నృత్యమే ఊపిరిగా జీవిస్తున్న మాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హర్షశ్రీ 25 ఏళ్లుగా 2 వేలకు పైగా నాట్య ప్రదర్శనలు ఇస్తూ 500కు పైగా అవార్డులు దక్కించుకుంది. 2010, డిసెంబరు 26న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రదర్శించిన అతిపెద్ద కూచిపూడి ప్రదర్శనకుగాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకుంది. నాట్యమయూరిగా బిరుదు దక్కించుకుంది. ఆమె ప్రతి విజయం వెనుక భర్త, అత్తమామ నిలవడం గర్వకారణం. ఇక రెండో కుమార్తె రామలాలిత్య కూడా కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యంలో ప్రతిభ చూపుతూ లెక్కలేనన్ని బహుమతులు గెలుచుకుంది. 2014, డిసెంబర్ 25న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన నాట్య ప్రదర్శనలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సైతం సొంతం చేసుకుంది. 2023, డిసెంబర్ 23న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కూచిపూడి కళావైభవంలో రామలాలిత్య నేతృత్యంలో మా శిక్షణా కేంద్రానికి చెందిన 12 మంది విద్యార్థులు పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నారు.2025, డిసెంబర్ 27న గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన కూచిపూడి కళావైభవంలో మా శిక్షణ కేంద్రం విద్యార్థులు 26 మంది పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నారు.


