వెన్నాడిన ‘తమ్ముళ్ల’ పాపం
శింగనమల: అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు సాగించిన ఇసుక తవ్వకాలు, అక్రమ తరలింపుల పాపం.. గొర్రెల కాపరుల పాలిట శాపంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శింగనమల మండలం సలకంచెరువు గ్రామం వద్ద ఉన్న కూతలేరు వంక నుంచి ఇటీవల టీడీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక తరలింపులు చేపట్టారు. ఈ క్రమంలో వంకలో పెద్ద ఎత్తున గోతులు ఏర్పడి అందులో నీరు చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం అటుగా వెళ్లిన గొర్రెలు దాహం తీర్చుకునే క్రమంలో అక్కడకు చేరుకోగానే ఇసుక దిన్నె కుప్పకూలి దాదాపు 25 గొర్రెలు నీటిలోకి పడి మృతి చెందాయి. ఘటనతో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఇరువెందల గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గంగరాజు కన్నీటి పర్యంతమయ్యాడు.
ఇసుక గుంతల్లో పడి
25 జీవాల మృతి


