ఏపీ బాలికల హాకీ జట్టుకు జిల్లా క్రీడాకారులు
ధర్మవరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ బాలికల హాకీ జట్టుకు శ్రీ సత్యసాయిజిల్లా క్రీడాకారులు ఎంపికై నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్, జిల్లా అధ్యక్షుడు బీవీఆర్ శ్రీనివాసులు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈనెల 26 నుంచి 30 వరకు జరిగే సౌత్‌జోన్ అస్మిత సబ్ జూనియర్ బాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టులో సభ్యులుగా శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన హాకీ బాలికల క్రీడాకారులు వైష్ణవి, మధురిమా భాయ్, వర్ష, దివ్య, హేమ, శివగంగ, మోక్షిత ఎంపికయ్యారని తెలిపారు. క్రీడాకారులను సత్యసాయి జిల్లా హాకీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, ఉపాధ్యక్షులు గౌరీప్రసాద్, మహమ్మద్ అస్లాం, ఉడుముల రామచంద్ర, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ కార్యదర్శి అరవింద్ గౌడ్, చంద్ర, సత్యసాయిజిల్లా హాకీ కోచ్ హస్సేన్, డైరెక్టర్లు మారుతికుమార్, అమునొద్దిన్, కిరణ్, ఇర్షాద్ అభినందించారు. ఈ పోటీల్లో బాలికలు రాణించాలని వారు ఆకాంక్షించారు.


