గడ్డినీ చుట్టేస్తున్నారు!
గడ్డి చుట్టలు కడుతున్న ట్రాక్టర్ యంత్రం
తలుపుల: యాంత్రీకరణను అందిపుచ్చుకున్న రైతులు చివరకు గడ్డినీ పరుపులా చుట్టేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యంత్రాన్ని ట్రాక్టర్ అమర్చుకుని గడ్డిని చుట్టేస్తుండడం పలువురిని ఆకట్టుకుంటోంది. ఎకరా పొలంలో వరి గడ్డి కుప్పలు చేసి ఒక చోట చేర్చాలంటే 6 నుంచి 7 మంది కూలీలు రోజంతా చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఎంత లేదన్నా రూ.4,800 ఖర్చు వస్తుంది. అదే యంత్రం సాయంతో గంటన్నర సమయంలోనే పని చక్క బెట్టేస్తున్నారు. దీంతో సమయంతో పాటు డబ్బూ ఆదా ఆవుతోంది. ఎకరాకు 50 నుంచి 60 చుట్టలు కాగా, చుట్టకు రూ. 35 నుంచి రూ.40 వసూలు చేస్తున్నారు.


